రాజా ది గ్రేట్ తో పుంజుకున్న మాస్ మహజ రాజ రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి టచ్ చేసి చూడు సినిమా విడుదలతో బిజిగా ఉన్నాడు. అంతవరకు బాగున్నా..కొంతమందికి ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతోంది తెలియదని అంటున్నారు. మొన్న ఆ మధ్య టచ్ చేసి చూడు సినిమా టీజర్ తో హాయ్ చేప్పినా అ తరువాత పత్తాలేకుండా పోయాడు. సినిమా విడుదలవుతున్నా ప్రమోషన్లు గట్రా చేస్తే వసూళ్లు రాబట్టుకునే అవకాశం ఉంది. కానీ అదేం జరగలేదు. నామమాత్రపు ఇంటర్వ్యూలతో మమ అనిపిస్తున్నాడు. దీనంతటికి రవితేజ ఓవర్ కాన్ఫిండెటే అని ఫిల్మింనగర్ వర్గాల టాక్. మాస్ మహరాజ్ చూపంతా మాస్ సెంటర్లమీదే ఉన్నట్లు తెలుస్తోంది. రాశిఖన్నా గ్లామర్ డోస్, సీరత్ కపూర్ అందాలతో ఫోస్టర్ల ప్రమోషన్ చేస్తే సరిపోతుంది. కానీ ఓవర్సీస్ లో ముఖ్యంగా అమెరికాలో టచ్ చేసి చూడు ఊసెక్కడాలేదని అనిపిస్తోంది.
దానికి కారణం అమెరికాలో త్రివిక్రమ్ డైరక్షన్ లో పవన్ హీరోగా అజ్ఞాతవాసి సినిమా భారీగా రిలీజ్ అయ్యింది. కానీ అంచనాల్ని తల్లకిందులు చేసిన ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో రవితేజ టచ్ చేసి చూడు సినిమాను పట్టించుకోవడంలేదంట. ముఖ్యంగా 1మిలియన్ డాలర్ రేంజ్ ను టచ్ చేయాలంటే ఓవర్సీస్ లో ప్రమోషన్ భారీ స్థాయిలో చేయాలి. కానీ అక్కడా సూన్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ లో కాసుల వర్షం కురవాలంటే సినిమా ప్రమోషన్ బాగుండాలి. కానీ రవితేజ అదేం చేయకుండా తనకు సినిమా పై ఉన్న ఓవర్ కాన్ఫిడెంట్ ను నమ్ముకుంటున్నాడు. అసలే కొత్తడైరక్టర్ సినిమా ఏమాత్రం బోల్తా పడినా కష్టమేనని అంటున్నారు సినీ జనాలు