రావురమేష్ ఇంట్లో విషాదం!

Update: 2018-04-07 08:12 GMT

ప్రముఖ సినీ నటుడు రావు రమేశ్‌కు మాతృవియోగం కలిగింది. కొండాపూర్‌లోని తన నివాసంలో రావుగోపాల్‌రావు భార్య కమలాకుమారి మృతి చెందారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. కమలాకుమారి మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కమలాకుమారి హరికథ కళాకారిణిగా పేరుతెచ్చుకున్నారు. ఆమె ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర ప్రాంతాల్లో దాదాపు 5000 ప్రదర్శనలు ఇచ్చారు. ఓ షోలో కమలాకుమారి ప్రదర్శనకు ముగ్ధుడైన రావుగోపాల్‌రావు ఆమెను ప్రేమవివాహం చేసుకున్నారు. రావుగోపాల్‌రావు కుమారుడు రావు రమేశ్‌ ప్రసుత్తం నటుడిగా టాలీవుడ్‌లో బిజీగా ఉన్నారు.

Similar News