ఏపీలో ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో వలసలు కూడా అప్పుడే మొదలయ్యాయి. 23 ఎమ్మెల్యేలు, బలమైన నాయకులను చేర్చుకుని అధికార టీడీపీ ఓవర్ లోడ్ అయింది. దాంతో వలసలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రతిపక్షం వైసీపీ వలసలను ప్రోత్సాహిస్తోంది. ఇటీవల ఆనం రామనారాయణ రెడ్డి, అబ్దుల్ ఘనీ వంటి సీనియర్లను చేర్చుకున్న వైసీపీ తాజాగా మరో బలమైన నేతను చేర్చుకుంటోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు నేడు జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. ఆయనకు గిద్దలూరు టికెట్ కన్ఫామ్ చేశారు జగన్. 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరుపున ఎమ్మెల్యేగా రాంబాబు గెలుపొందారు. ఆ తరువాత 2013 లో టీడీపీలో చేరారు. అయితే 2014
ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీలో చేరిపోయారు. దాంతో రాంబాబు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ క్రమంలో ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.