తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. రాష్ట్రసాధనలో తన పోరాట పటిమతో తెలంగాణ ప్రజలకు గుర్తిండిపోయేలా చేసిన తెలంగాణ జేఏసీ ప్రొఫెసర్ కోందండ రాం కొత్తపార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన గుర్తు, అజెండా ఇలా తదితర అంశాలపై ఓ క్లారిటీ వచ్చినట్లు ఓయూలో హల్ చల్ చేస్తుంది.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులకు పాఠాలు చెప్పిన ఈ మాస్టారు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పలుమార్లు అధికారపార్టీ నేతలపై దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. సందర్భాను సారం ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే ఈ ఫ్రొఫెసర్ తొలత కాంగ్రెస్ పార్టీ, ఇతర లెఫ్ట్ పార్టీలతో కలిసి తన గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు.
ఇక కోదండరాం పెట్టబోయే పార్టీ తెలంగాణ జనసమితిగా పేరును ఖరాచేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతుల్ని వ్యతిరేకిస్తుందనే భావన కలిగించేలా తెలంగాణ జనసమితి గుర్తును కూడా నాగలి పట్టుకున్న రైతుగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.
వీటితో పాటు తెలంగాణ ప్రజాసమితి, తెలంగాణ సకల జనులపార్టీ పేర్లను పరిశీలించిన టీజేఎస్ (తెలంగాణ జనసమితి) బాగుందని పార్టీ పేరుగా అదే నిర్ణయించినట్లు చెప్పుకుంటున్నారు. పార్టీ గుర్తుపైనే కోదండరాం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నారు. ఇప్పటికే రైతు నాగలి పట్టుకున్న గుర్తు జాతీయస్థాయిలో జనతా పార్టీకి ఉంది. కానీ ఆ పార్టీ క్యారకాలపాలు అంతగాలేనందున.. దాంతో ఆ పార్టీ గుర్తు రద్దు కానుందనే సంకేతాలు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్నాయి. ఆ గుర్తునే తమకు కేటాయించాలని ఆ లేఖలో పేర్కొన్నారట.