మంత్రి నారా లోకేష్ పై టీజీ వెంకటేష్ ఫైరయ్యారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంపై సీరియస్ గా స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చిన మంత్రి అభ్యర్థులను ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. లోకేష్ పార్టీ అధ్యక్షుడు కాదని అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తే అప్పుడు స్పందిస్తానన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి లోకేష్ ను హిప్నాటైజ్ చేసినట్టు ఉందని, అభ్యర్థుల ప్రకటన తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని టీజీ వెంకటేష్ అన్నారు.