మిర్యాలగూడలో కిరాయి హంతకుల చేతిలో హత్యకు గురైన ప్రణయ్ కుటుంబ సభ్యులను, ప్రణయ్ భార్య అమృత వర్షిణిని మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శించారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని చెప్పారు. మారుతీరావు లాంటి వ్యక్తులకు సంఘ బహిష్కణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలను కుటుంబ సభ్యులకు అందజేస్తామని ప్రకటించారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున 8 లక్షల 25వేల రూపాయలు, డబుల్ బెడ్‌రూం ఇల్లు, వ్యవసాయ భూమి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశించడం జరిగిందన్నారు. గంటల వ్యవధిలోనే పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించి హంతకులను పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు సహించదని తెలిపారు.