తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలతో రెండో రోజు కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరిగింది. సచివాలయంలో ఉపాధ్యాయ సంఘ నేతలతో.. ఈటల, కేటీఆర్, జగదీశ్‌రెడ్డితో కూడిన మంత్రి వర్గ ఉప సంఘం చర్చలు జరిపింది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పెట్టిన 18 డిమాండ్ల గురించి చర్చ జరిగింది. ఉద్యోగ సంఘాల డిమాండ్లు, చర్చలు వివరాలతో కూడిన సమగ్ర నివేదికను మంత్రుల కమిటీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు త్వరలో అందచేయనుంది. ఉద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రే ఓ నిర్ణయం తీసుకుంటారు. అయితే చర్చలు సానుకూలంగా జరిగాయని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. సీఎంతో భేటీ ఏర్పాటు చేస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చిందని చెప్పారు.