బ్యాంకులకు సుమారు 6 వేల కోట్లు బకాయిపడి.. తీర్చకుండా కుచ్చుటోపీ పెట్టారని ఆరోపణలు ఎదుర్కుంటున్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరు కానున్నారు. బ్యాంకుల ఫిర్యాదు మేరకు సుజనా చౌదరి కంపెనీలపై ఈడీ దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని సుజనా చౌదరి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా. వాటిని కోర్టు కొట్టేసింది. డిసెంబర్ 3న ఈడీ ముందు సుజనా చౌదరి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని కోర్టు ఆదేశించడంతో ఆయన ఇవాళ ఈడీ ముందు హాజరుకానున్నారు.