టీడీపీ ఎంపీ జేసీ దివాకర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జాతీయ స్థాయిలోఎదగ కూడదనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గతంలో మూడవ కూటమి ఏర్పాటులో చంద్రబాబు కీలకంగా వ్యవహరించారనే భయం మోడీకి ఉందని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా ఫలితం ఉండదన్న జేసీ..పదవీ త్యాగాల వల్ల ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం లేదని అన్నారు.