కడప జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. రాజుపాలెం మండలం చిన్నశెట్టిపల్లె గ్రామంలో పొలాలకు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జ్ విషయంలో ఘర్షణ పడ్డారు. 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన కాంట్రాక్టర్ ప్రభాకర్ రెడ్డి చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి వర్గానికి చెందిన నర్సింహారెడ్డి పొలం వద్ద నీటి మళ్లింపు కోసం పైపులు అమర్చాడు. దీనిపై ఇరు వర్గాలు గొడవలకు దిగి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. విషయం తెలుసుకున్న రాజుపాలెం, ప్రొద్దుటూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిలోకి అదుపులోకి తెచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.