ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున. ఏపీలో విపక్షం వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి.ఇప్పటికే కొంతమంది లీడర్లు వైసీపీలో చేరగా.. తాజాగా లోటస్ పాండ్ లోని వైసీపీ కార్యాలయంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి... వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. జగన్ నివాసానికి చేరుకున్న ఆనం... కొద్ది సేపు ఆయనతో చర్చలు జరిపారు. వైసీపీలో చేరే అంశంపైనే ఇద్దరి మధ్య మంతనాలు జరిగాయి. రెండు రోజుల్లో ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.