టీటీడీ తీరుపై స్వామి స్వరూపానంద తీవ్ర ఆగ్రహం

Update: 2018-12-25 09:55 GMT


టీటీడీ తీరుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానంద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులను తొలగించే హక్కు టీటీడీ, దేవాదాయ శాఖలను లేదంటూ ఆయన మరోసారి స్పష్టం చేశారు. వయోపరిమితి పేరుతో అర్చకులను తొలగించడం సరికాదన్నారు.  అర్చకత్వాన్ని నాశనం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయన్న ఆయన అర్చకులు, భక్తులకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వ జోక్యం తగదన్నారు.  హైకోర్టు తీర్పు టీటీడీకి చెంప పెట్టు లాంటిదన్న స్వరూపానంద  టీటీడీ పొరపాట్లపై పోరాటం చేస్తున్న సుబ్రహ్మణ్యస్వామి తన శిష్యుడేనన్నారు. అర్చకుల మేలు కోసమే శారదాపీఠం పోరాడుతుందని స్వరూపనంద స్పష్టం చేశారు. 

Similar News