కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ మరణంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమెను అత్యచేశారని , అందుకు తగ్గ ఆధారాలు తమవద్ద ఉన్నాయంటూ ఓ సీక్రెట్ రిపోర్ట్ చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రతులను డీఎన్ ఏ పత్రిక సంపాదించింది.
2014లో శశిధరూర్ భార్య సునంద పుష్కర్ ఢిల్లీ లోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్దితిలో మృతి చెందారు. ఢిల్లీ పోలీసులు లీలా హోటల్ లో ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. 2010 లో వివాహం చేసుకున్న శశిధరూర్, సునంద మధ్య గత కొద్దిరోజులుగా మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. పాకిస్తాన్ కు చెందిన మహిళ జర్నలిస్ట్ విషయంలో వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. అయితే తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని ధరూర్ దంపతులు ఇద్దరు కలిసి ఓ ప్రకటన చేసారు. ఆ ప్రకటన చేసి కేవలం ఒక రోజు గడవక ముందే సునంద పుష్కర్ మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దర్యాప్తులో ఉండగా ఆమె మరణంపై అనేక అనుమానాలు తలెత్తాయి.
సునంద మరణంపై విచారణ జరిపిన నేపథ్యంలో అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ ఓ నివేదికను తయారు చేసింది.ఆ నివేదికలో ఆమె మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయిందని ఆమె వంటిపై 12 చోట్ల గాయాలు ఉన్నాయని కాని అవి ప్రాణాలు తీసేంత గాయాలు కావని తేల్చింది. దీనితో ఇప్పటివరకు ఆత్మహత్య అనుకున్న పోలీసులకు ఈ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. ఆమె మద్యంలో ఎవరు విషం కలిపి వుంటారు..? ఆమె ఎందుకు మరణించింది అనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరిపారు. అయితే ఆమె మరణంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండగా ..ఆమెది హత్యే అని ఓ సీక్రెట్ రిపోర్ట్ చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రతులను డీఎన్ఏ పత్రిక సంపాదించింది. డీఎన్ ఏ కథనం ప్రకారం పుష్కర్ కేసులో తొలి రిపోర్ట్ ఇచ్చిన అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ బీఎస్ జైస్వాల్.. సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
2014లో ఆమె మరణించిన లీలా హోటల్ లోని రూమ్ ను వసంత్ విహార్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ అలోక్ శర్మ పరిశీలించి అతి ఆత్మహత్య కాదని చెప్పినట్లు ఆ రిపోర్ట్ లో స్పష్టంగా ఉంది. ఆమె ఒంటిపై మొత్తం 15 గాయాలు ఉన్నాయి. అందులో పదో నంబర్ గాయం ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఏర్పడినది. 12వ నంబర్ గాయం చూస్తే ఎవరో కొరికినట్లుగా ఉంది. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లుగా ఒంటిపై గాయాలు ఉన్నాయి` అని ఆ రిపోర్ట్ వెలుగులోకి తెచ్చింది. దీంతో సునంద మరణంపై మరింత లోతుగా విశ్లేషించేందుకు అధికారులు నిమగ్నమైనట్లు వార్తలు వస్తున్నాయి.