వైసీపీ విద్యార్థి విభాగం నేతల అరెస్టు పై స్పందించిన వైయస్ జగన్

Update: 2018-10-03 14:16 GMT

నిన్న గాంధీజయంతి రోజున ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన నిరుద్యోగ భృతిపై విజయవాడలో ఆందోళనకు దిగారు వైసీపీ విద్యార్థి విభాగం నేతలు. తమకు కావలసింది సరిపడని భృతి కాదని. ఉద్యోగాలని నినాదాలు చేసారు. దాంతో పరిస్థితి అదుపు తప్పుతుందన్న కారణంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం వైసీపీ విద్యార్థులు అరెస్టుపై స్పందించారు ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. అధికారుల నుంచి అనుమతి తీసుకున్నా విద్యార్థులను అరెస్ట్‌ చేయడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థుల నిరసనలు, పోరాటాలు చూసి భయమేస్తోందా చంద్రబాబు అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని విజయవాడ విద్యార్థులు నిరసనకు దిగితే అది తప్పు ఎలా అవుతుందని అన్నారు.

Similar News