విజయవాడలో దారుణం జరిగింది. కృష్ణానది సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఉద్యోగి మాధవరావుపై ఆకతాయిలు దాడికి దిగారు. రైల్వే ట్రాక్ సమీపంలో మద్యం సేవిస్తున్న ఆకతాయిలు అటుగా వెళుతున్న మాధవరావును అడ్డుకున్నారు. డబ్బు, సెల్ ఫోన్ ఇవ్వాలంటూ మాధవరావుపై దాడికి దిగారు. ఈ ఘటనలో మాధవరావు తీవ్రంగా గాయపడ్డారు. మాధవరావు కేకలు విని చుట్టుపక్కల వారు రావడంతో ఆకతాయిలు పారిపోయారు .తీవ్రంగా గాయపడిన మాధవరావును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు బ్లేడ్ బ్యాచ్ పనిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.