ప్రాణాలను బలితీసుకుంటున్న వివాహేతర సంబంధాలు..నవ్వుతూ మీడియా ముందుకొచ్చిన శ్రీవిద్య..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను బావతో కలసి హత్య చేసింది భార్య. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితురాలు శ్రీవిద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం నరేంద్రను చంపి మృతదేహాన్ని తీసుకెళ్లి పడేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో విస్తుగొలిపే నిజాలు వెలుగులోకి వచ్చాయ్.
విహేతర సంబంధాలు ప్రాణాలను బలితీసుకుంటున్నాయ్. కన్న పేగు తెంచుకుని పుట్టిన పిల్లలకు, కన్న వారిని దూరం చేస్తున్నాయ్. మొన్న స్వాతి, నిన్న జ్యోతి...నేడు శ్రీవిద్య. వీరు ముగ్గురు వివాహేతర సంబంధాల కారణంగానే...భర్తలను ప్రియుళ్లతో కలిసి పథకం ప్రకారం హత్య చేశారు. ఇప్పుడు జైలు ఊచలు లెక్క పెడుతున్నారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను బావతో కలసి హత్య చేసింది భార్య. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
మృతుడు నరేంద్రకు చెందిన ఒక చెప్పు మాత్రమే సంఘటన స్థలంలో లభ్యమైంది. విచారణ చేపట్టిన పోలీసులు మరో చెప్పును వీరయ్య చౌదరి కారులో గుర్తించడంతో నరేంద్ర హత్య కేసు మిస్టరీ వీడింది. దీంతో వీరయ్య చౌదరి, అతడికి సహకరించిన గుంజి బాలరాజు, పూజల చౌడయ్యను పోలీసులు అరెస్టు చేశారు. అయితే భార్య శ్రీవిద్య పరారీలో ఉండటంతో ఆమెకోసం బృందాలుగా గాలించిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
గుంటూరు జిల్లా పొనుగుబాడుకు చెందిన నరేంద్రకు...మేనమామ కుమార్తె శ్రీవిద్యతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. నరేంద్ర పేరేచర్లలోని ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. శ్రీవిద్య నరసరావుపేటలో ఓ ప్రైవేటు స్కూలులో పనిచేస్తోంది. పెళ్లికి ముందే ఆమెకు ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామానికి చెందిన తన అక్క భర్త గొట్టిపాటి వీరయ్య చౌదరితో వివాహేతర సంబంధం ఉంది. నరేంద్ర భార్య శ్రీవిద్యపై అనుమానంతో ఆమె కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు... శ్రీవిద్య తరుచూ వీరయ్యతో మాట్లాడినట్లు తేలింది. బావతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే పక్కా స్కెచ్‌తోనే భర్తను హత్య చేయించింది శ్రీవిద్య. మొత్తానికి మొగుళ్లను చంపిన పెళ్లాల జాబితాలో...స్వాతి, జ్యోతిల తర్వాత శ్రీవిద్య కూడా చేరింది.