గెలుపే లక్షంగా అడుగులు

Update: 2018-07-22 01:58 GMT

వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్షంగా ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రతో రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టిన జగన్.. వివిధ సంఘాల ప్రతినిధులతో భేటీ అయ్యి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా నిన్న(శనివారం) కాకినాడ రూరల్ నియోజకవర్గం అచ్చంపేట క్రాస్‌ వద్ద మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మత్స్యకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని చెప్పారు.  మత్య్సకారులకు వేట విరామ సమయంలో ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 15 దాకా రూ.10 వేలు ఇస్తామన్నారు. సముద్రంలోవేటకు వెళ్లిన మత్స్యకారుల జీవితాలకు చాలా రిస్క్‌ ఉంటుంది. వారికేదైనా జరగకూడనిది జరిగితే రూ.10 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తాం అని చెప్పారు. ఇక మత్స్యకారులు ఎక్కువగా  ఉన్న ప్రాంతమైన కాకినాడలో మెరైన్‌ యూనివర్సిటీ స్థాపిస్తాం అని జగన్ చెప్పారు.  

Similar News