జగన్‌పై దాడి ఘటనపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. పిల్ల కుంకను పంపి.. హత్యకు ప్లాన్ చేస్తామా అని అన్నారు. ఏదైనా చెయ్యాలనుకుంటే చేతిపై గుచ్చి రమ్మని పిల్లాడిని పంపుతామా అని ప్రశ్నించారు. మేం హత్యకు ప్లాన్ చేస్తే రాజారెడ్డి, వైఎస్‌ఆర్ స్థాయిలో ఉంటుందని.. వైసీపీ ఇకనైనా డ్రామాలు ఆపాలని అన్నారు.