జనసేన అధినేత పవన్ ఖమ్మం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ కారు ఎస్ఐ కాలు మీదకు ఎక్కేసింది. దీంతో ఎస్ఐ చిరంజీవి కాలికి తీవ్ర గాయమైంది. గాయపడిన ఎస్ఐని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన పవన్ కారు డ్రైవర్‌పై కేసు నమోదయ్యింది. చికిత్స పొందుతున్న ఎస్ఐ చిరంజీవికి పవన్ కల్యాన్ ఫోన్ చేసి పరామర్శించారు.