మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల వేళా అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ స్వయానా బావమరిది సంజయ్‌సింగ్ మసానీ శనివారం బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ కీలకనేతలైన కమల్‌నాథ్, మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. చౌహాన్ సతీమణి సాధనాసింగ్ సోదరుడైన సంజయ్ సింగ్.. కొంతకాలంగా బీజేపీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన అనంతరం అయన మాట్లాడుతూ.. 13 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన శివ్‌రాజ్ అవసరం రాష్ట్రానికి లేదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బీజేపీ వారసత్వ రాజకీయాలను పెంచిపోషిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని అయన జోస్యం చెప్పారు.