ఊపిరి పీల్చుకున్న భారత్

Update: 2018-10-24 17:08 GMT

విశాఖ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన రెండో వన్డే ‘టైై’ అవడంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. 322 పరుగుల భారీ విజయలక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది.  భారత బౌలర్లపై విరుచుకుపడిన హెట్‌మైర్‌ ఓటవడంతో కోహ్లి సేన ఊపిరి పీల్చుకుంది. అతడు 64 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 94 పరుగులు చేసి శతకన్ని చేజార్చుకున్నాడు. చహల్‌ బౌలింగ్‌లో అనవసరం షాట్‌కు ప్రయత్నించి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి చిక్కాడు.  

ఓపెనర్లు కీరన్ పావెల్(18), హేమ్ రాజ్(32) జోడీ శుభారంభాన్నిచ్చింది. ఆ తర్వాత వచ్చిన హోప్(123 నాటౌట్) ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హోప్‌కు షిమ్రోన్ హిట్ మెయిర్(94) జత కలవడంతో భారత విజయ అవకాశాలు ఆవిరయ్యాయి. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, షమీ, ఉమేశ్, చాహల్ చెరో వికెట్ తీసుకున్నారు.
 
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. వెస్టిండీస్‌కు 322 పరుగుల భారీ టార్గెట్‌ను ఇచ్చింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 321 పరుగులు చేసింది. కాగా టీమిండియా రెండో వన్డే లో సైతం గెలిచి.. తన ఖాతాలో వేసుకుంటుందనుకున్న భారత్ అభిమానుల ఆశ నెరవేరలేదు.

Similar News