టీటీడీకి వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈవో శ్రీనివాసులు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించారంటూ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణమ్మ కుమార్తెను ఆలయానికి తీసుకొచ్చింది. ఆలయంలో అన్నపూర్ణమ్మ కూతుర్ని చూశాక కూతుర్ని ఒప్పించాలంటూ వేధించడం మొదలు పెట్టాడు. వేధింపులు కాస్తా శృతిమించడంతో తల్లికూతుళ్లు చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.