ఈ మధ్య ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతుంది. ఫ్యాన్స్ ని చూసి హీరోలు మారుతున్నారు. సహజంగా టాలీవుడ్ లో మనం ఎంతగానో అభిమానించే హీరో కనబడితే షేక్ హ్యాండ్ ఇవ్వడమో, గట్టిగా హగ్ చేసుకోవడమో చేస్తుంటాం. కానీ తమిళ తంబీలు అలా కాదు. హీరో కనబడితే చాలు మొక్కుకోవడం, ప్రదిక్షణలు చేయడం, కాళ్లకు నమస్కారం చేయడం, కాళ్లు పట్టుకోవడంలాంటివి చేస్తుంటారు. ఇలాంటి సీన్లని రజనీకాంత్ పార్టీ ప్రకటించే సమయంలో జరిగిన విషయం తెలిసింది. కొద్ది రోజుల తరువాత హీరో సూర్య గ్యాంగ్ అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఆ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే ఈ ఫంక్షన్ లో అభిమానులు సూర్యని కలిసిన అనంతరం కాళ్లపట్టుకున్నారు. దీంతో వారి అభిమానానికి ముగ్ధుడైన సూర్య కూడా వాళ్ల కాళ్లు పట్టుకొన్నాడు. అభిమానలు దేవుళ్లుగా భావించే ఇండస్ట్రీ కి చెందిన హీరోలు సూర్యను చూసి ఫిదా అయ్యారు.
ఇక సరిగ్గా అలాంటి పరిస్థితి సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కు కూడా ఎదురైంది. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన సాయిధరమ్ తేజ్ వరుస సినిమాలతో జోరుమీదున్నాడు. అయితే ఎక్కడా మెగా అనే బిరుదును తగిలించుకోకుండా సొంతంగా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం సాయి వినాయక్ డైరక్షన్ లో ఇంటిలిజెంట్ సినిమా చేశాడు. ఈ సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ ను ప్రారంభించింది. ప్రమోషన్ లో ఉన్న సుప్రీం హీరోకి ఓ అభిమాని షాక్ ఇచ్చాడు. తన అభిమాన నటుడు వచ్చిన ఆనందంలో ఆ అభిమాని సాయి కాళ్లు మొక్కాడు. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా సాయి కూడా కాళ్లు మొక్కాడు. ఇప్పుడా ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరి నిన్న హీరోసూర్య మంచితనానికి ఫిదా అయ్యాడో లేక సాయి అలా చేశాడో తెలియదు కానీ..మెగా మేనల్లుడు చేసిన పనికి ప్రతీ ఒక్కరు అభినందిస్తున్నారు.