త్వరలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికలకు కొన్ని వారాల ముందు ఆర్ఎస్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. రానున్న ఎన్నికల్లో 78 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వొద్దంటూ బీజేపీకి సూచించింది. అంతేకాదు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ను బుధిని నుంచి కాకుండా గోవిందపురా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనీ సలహా ఇచ్చింది. బీజేపీకి పెట్టని కోటగా గోవిందపురా నియోజకవర్గం ఉంది. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ గౌర్.. 1980 నుంచి మొత్తం 8 సార్లు ఇక్కడి నుంచే గెలిచారు. ఇదిలావుంటే బుధినిలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు గట్టి పోటీని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపుతోంది.