టీఆర్‌ఎస్‌ టార్గెట్‌ 16

Update: 2018-12-26 14:58 GMT

 ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కోసం రాష్ట్రాలను చుట్టేస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటికే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌, మమతా బెనర్జీతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. మొత్తానికి లోక్‌సభ ఎన్నికలకు ముందే ఫెడరల్‌ ఫ్రంట్‌‌ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌‌ చెప్పినట్లుగానే ఆయా ప్రాంతీయ పార్టీల అధినేతలను కలుస్తూ కలిసి రావాలని కోరుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కెసిఆర్ తమ వ్యూహాలకు పదును పెట్టానున్నారు. ఎంఐఎం ప్రాతినిధ్యం వహించే హైదరాబాద్‌ స్థానం తప్ప మిగత 16 ఎంపీ సీట్లపై కన్నుపడింది. ఎలాగైన తమ సర్వ శక్తులనూ ఒడ్డి పోరాడైన 16ఎంపీ సీట్లను గెలవాలని టీఆర్ఎస్ పార్టీ నేతలను కెసిఆర్ ఆదేశించారు. ఇక ఇటివలే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన కెసిఆర్ సైతం లోక్‌సభ ఎన్నికల వైపే కన్నేశారు. ప్రతి లోక్‌సభ సెగ్మెంట్‌కు ఒక ప్రధాన కార్యదర్శిని, ముగ్గురు కార్యదర్శులను బాధ్యలుగా నిర్వహించారు. లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు బాధ్యులుగా ఉంటారని అధిష్ఠం స్పష్టం చేసింది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైతుంది.
 

Similar News