అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. ధర్మవరంలో జరుగుతున్న పెళ్లికి హాజరయ్యేందుకు బొలేరోలో వెళుతుండగా పెనుకొండ మండలం సత్తారుపల్లి దగ్గర వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై శవాలు చెల్లాచెదురుగా పడటంతో పరిస్ధితి భయానకంగా మారింది. స్ధానికుల సమాచారంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.