టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్ శాసనసభ సభ్యత్వాల రద్దుపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దును కొట్టివేసిన హైకోర్టు... తాజాగా అప్పీల్ పిటిషన్‌ను కూడా తిరస్కరించింది.