దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... తాజాగా తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ ప్యాక్‌గా గుర్తింపు పొందిన రూ.399పై రూ.50 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హాలీడే హంగామా పేరుతో వస్తున్న ఈ ఆఫర్ జూన్ 1 నుంచి జూన్ 15 వరకు అందుబాటులో ఉంటుంది. మైజియో యాప్ ద్వారా మాత్రమే రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ ఫోన్‌పె ద్వారా చేస్తేనే ఈ క్యాష్‌బ్యాక్ వస్తుంది.
దీంతోపాటు జియో అందిస్తున్న రూ.50 డిస్కౌంట్ వోచర్లు కూడా కస్టమర్లకు వస్తాయి. రూ.399 ప్లాన్ కింద 84 రోజుల పాటు రోజూ 1.5 జీబీ 4జీ డేటా, వంద ఎస్సెమ్మెస్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయన్న విషయం తెలిసిందే. శనివారం నుంచీ ఈ ఆఫర్ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. జియో రెండు రోజుల కిందటే సామ్‌సంగ్ గెలాక్సీ జే2, గెలాక్సీ జే7 ప్రొ స్మార్ట్‌ఫోన్లపై రూ.2750 వరకు క్యాష్‌బ్యాక్ ప్రకటించిన విషయం తెలిసిందే.