What's Changing in India in 2025: జనవరి 1 2025 తరువాత ఇండియాలో ఏమేం మారనున్నాయి?

Update: 2025-01-01 01:00 GMT

GST updates - జీఎస్టీ కంప్లయన్స్ అప్‌డేట్స్:

గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చెల్లింపుల విషయంలో అవకతవకలు లేకుండా చూడటంతో పాటు టాక్స్ పేయర్స్ పేమెంట్స్ సెక్యురిటీ పెంచడం కోసం 2025 నుండి కొత్తగా మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ( MFA ) అమలు చేయనున్నారు. జీఎస్టీ చెల్లించే సంస్థలు, వ్యక్తులకు ఇది వర్తించనుంది.

H-1B Visa processing - వీసా ప్రాసెసింగ్‌లో మార్పుచేర్పులు:

యూఎస్ వీసా అపాయిట్మెంట్ రీషెడ్యూలింగ్- ఇండియాలో ఉండే నాన్-ఇమ్మిగ్రంట్ వీసా దరఖాస్తుదారులు ఒక్కసారి ఉచితంగా వీసా అపాయిట్ మెంట్ రీషెడ్యూల్ చేసుకునేందుకు అనుమతించనున్నారు. ఆ తరువాత మరోసారి రీషెడ్యూల్ చేసుకోల్చుకుంటే మళ్లీ కొత్తగా అప్లై చేసి, ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

H-1B వీసా ప్రక్రియ-

H-1B వీసా జారీ ప్రక్రియను ఆధునీకరించేందుకు జనవరి 17 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఉద్యోగాలు కల్పించే ఎంప్లాయర్స్ తో పాటు ఇండియన్ F-1 వీసా హోల్డర్స్ సౌలభ్యం కోసం ఈ కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు.

LPG prices - ఎల్పీజీ ధరలు:

జనవరి 1 నుండి డొమెస్టిక్, కమెర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగే ప్రమాదం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

EPFO Pension withdrawals - ఈపీఎఫ్ఓ పెన్షన్ విత్‌డ్రావల్ రూల్స్:

జనవరి 1, 2025 నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ కింద అర్హులైన పెన్షన్ హోల్డర్స్ అదనపు వెరిఫికేషన్ అవసరం లేకుండా ఏ బ్యాంకు నుండి అయినా పెన్షన్ విత్‌డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ వీలు కల్పిస్తోంది. రిటైర్ అయిన ఉద్యోగులు తమ పెన్షన్ డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

UPI transaction limit- యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు:

ఇప్పటివరకు బేసిక్ ఫోన్లలో యూపీఐ 123పే ( UPI 123Pay ) పద్ధతిలో యూపీఐ చెల్లింపులు చేసే వారికి రోజుకు రూ. 5,000 వరకు పరిమితి ఉంది. కానీ జనవరి 1, 2025 నుండి ఈ యూపీఐ 123 పే పేమెంట్స్ లిమిట్ ను 5 వేల నుండి 10 వేల రూపాయలకు పెంచుతున్నారు. ఫీచర్ ఫోన్లు ఉపయోగించి యూపీఐ పేమెంట్స్ చేసేవారికి ఇది ఎంతో సౌకర్యం అందించనుంది.

Farmers loans limit - రైతులకు రుణాల పరిమితి పెంపు:

వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించడం కోసం 2025 జనవరి 1వ తేదీ నుండి రైతులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా 2 లక్షల రూపాయల వరకు రుణం పొందడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఇలా ఏ గ్యారెంటీ లేకుండా రైతులకు ఇస్తోన్న రుణం కేవలం రూ. 1 లక్షా 60 వేల వరకు మాత్రమే పరిమితమై ఉంది.

Financial Transaction Updates - ఆర్థిక లావాదేవీలు:

జనవరి 1, 2025 నుండి ఫిక్స్ డ్ డిపాజిట్స్, క్రెడిట్ కార్డ్ గైడ్ లైన్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ పలు మార్పులు తీసుకొస్తోంది. ఈ కొత్త నిబంధనల కారణంగా నాన్-బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీలు, హౌజింగ్ లోన్ ఇచ్చే హౌజింగ్ ఫినాన్స్ కంపెనీల వద్ద ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్స్ 3 నెలలోపు వడ్డీ లేకుండా చిన్న మొత్తాలను విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. వీటినే ప్రిమెచ్యూర్ విత్‌డ్రావల్స్ (Premature withdrawals from FDs) అని కూడా అంటుంటాం.

Changes in Credit Card Benefits - క్రెడిట్ కార్డ్స్ బెనిఫిట్స్ రూల్స్ మార్పు

ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు కొన్నిరకాల ఫ్రీ బెనిఫిట్స్ ఉండేవి. ఉదాహరణకు కొన్ని బ్యాంకులు తమ క్రెడిట్ కార్డు కస్టమర్స్‌కు ఎయిర్ పోర్ట్ లాంజ్‌లోకి (Airport lounge access) ఫ్రీ యాక్సిస్ కల్పిస్తుంటాయి. కానీ ఇకపై క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ ఆ ఫ్రీ యాక్సిస్ పొందాలంటే వారు బ్యాంకులు నిర్ధేశించిన మొత్తాన్ని క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఖర్చు చేయాల్సి ఉంటుంది.

EPFO Money with drawals through ATMs - ఏటీఎం నుండి ఈపీఎఫ్ మనీ విత్‌డ్రా:

ఈ ఏడాది ఈపీఎఫ్ ఎకౌంట్ హోల్డర్స్ కు చెప్పుకోదగిన బెనిఫిట్స్ లో ఇది కూడా ఒకటి. అత్యవసరంలో డబ్బులు అవసరం ఉన్న వారు తమ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులను ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఈపీఎఫ్ డబ్బులు విత్ డ్రా చేసుకోవాలంటే ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అవడం లేదా ఉమంగ్ మొబైల్ యాప్ ద్వారా లాగిన్ అయి విత్ డ్రా రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి వచ్చేది.

ఆ రిక్వెస్ట్ ఈపీఎఫ్ అప్రూవల్ పొందడానికి కనీసం వారం నుండి రెండు వారాల సమయం పడుతుంది. అప్రూవ్ అయిన తరువాత ఆ డబ్బులు మీ బ్యాంక్ ఎకౌంట్లో క్రెడిట్ అయ్యేందుకు కనీసం మరో రెండు, మూడు రోజులు పడుతుంది. కానీ ఇకపై ఏటీఎంలోనే విత్ డ్రా చేసుకునే అవకాశం రావడం అనేది అత్యవసరంలో డబ్బులు అవసరం ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది.

Aviation Fuel charges - విమానాల ఇంధనం ధరలు:

విమానాల్లో ఉపయోగించే వైట్ పెట్రోల్ ధరలు కూడా ఈ ఏడాది ఆరంభంలోనే పెరిగే అవకాశం ఉందని ఏవియేషన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే కానీ జరిగితే విమానాల టికెట్ రేట్లు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది.

Mobile data charges - మొబైల్ డేటా చార్జీలు:

ఈ ఏడాది నుండి జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ వంటి టెలికాం కంపెనీలు తమ డేటా చార్జీలు పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇటీవల కాలంలో డేటా చార్జీలు భారీగా పెరగడం అనేది మొబైల్ యూజర్స్ పై భారీగా ఆర్థిక భారం పడేలా చేసింది. ఇకపై ఈ భారం ఇంకొంత పెరిగే ప్రమాదం లేకపోలేదు.

Banks Holiday on January 1st 2025 - జనవరి 1 2025 బ్యాంకు సెలవు?

జనవరి 1 నాడు బ్యాంకులకు వర్కింగ్ డే కానుందా లేక హాలీడే కానుందా అనే సందేహం చాలామందిని వెంటాడుతోంది. ముఖ్యంగా ఫస్ట్ తారీఖునాడు జీతాల కోసం వేచిచూసే ఉద్యోగులు లేదా ఏవైనా ఇతర ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల కోసం ప్లాన్ చేస్తున్న వారిలో ఈ సందేహం కనిపిస్తోంది. అయితే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు ఎవరికి వారే ప్రత్యేకమైన హాలీడే క్యాలెండర్‌ను పాటిస్తున్నాయి. దీంతో బ్యాంకు సెలవు అనేది ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

కుప్తంగా ఏయే మార్పులు రానున్నాయంటే...

  • జీఎస్టీ - కొత్తగా మల్టీఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అమలు
  • వీసా ప్రాసెసింగ్ చార్జీలు
  • ఎల్పీజీ ధరలు
  • ఈపీఎఫ్ఓ పెన్షన్ విత్‌డ్రావల్ రూల్స్ - పెన్షనర్స్‌కు పెన్షన్ ఈజీ విత్‌డ్రావల్ పాలసీ 
  • యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంపు - ఫీచర్ ఫోన్ ద్వారా యూపీఐ పేమంట్స్ చేసేవారికి డబుల్ బెనిఫిట్
  • రైతులకు రుణాల పరిమితి పెంపు - రైతులకు అదనపు ప్రయోజనం
  • ఆర్థిక లావాదేవీలు 
  • ఏటీఎం నుండి ఈపీఎఫ్ మనీ విత్‌డ్రా - అదనపు సౌకర్యం
  • విమానాల ఇంధనం ధరలు - విమానాల టికెట్ రేట్ల పెంపు
  • మొబైల్ డేటా చార్జీలు - అదనపు ఆర్థిక భారం
Tags:    

Similar News