హీరోయిన్లు సెక్స్ వర్కర్ల కంటే దారుణమంటూ ప్రముఖ నిర్మాత భార్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తాను అందరి హీరోయిన్ల గురించి చెప్పడంలేదని, తాను చూసిన, తాను గమనించిన కొన్నిసంఘటనలపై కొంతమంది హీరోయిన్ల గురించి మాత్రమే చెబుతున్నానంటూ ట్వీట్ చేశారు.
జ్ఞాన వేల్ రాజా పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత. సూర్యాతో సింగ్ -3, గ్యాంగ్ సినిమా తీశారు. ఈ నేపథ్యంలో ఇన్నిరోజులు ప్రపంచానికి పరిచయంలేని జ్ఞానవేల్ రాజా అతని భార్య నేహా ఒక్కసారిగా టైమ్ లైన్ లోని వచ్చారు.
ఇప్పటికే టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై పలువురు హీరోయిన్లు పబ్లిక్ గానే మండిపడుతున్నారు. హీరో లనుంచి డైరక్టర్లు, ప్రొడ్యూసర్ల వరకు కొత్తసినిమా అంటే చాలా అవకాశాలు ఇప్పిస్తామని.., అందుకు కమిట్మెంట్ కావాలని డిమాండ్ చేస్తారని ఓ హీరోయిన్ ఇండస్ట్రీలో విష సంస్కృతి గురించి నిప్పులు చెరిగింది.
కానీ తమిళ ఇండస్ట్రీలో అలా లేదని, ఆడవారికి ఆడవారే శత్రువులంటూ జ్ఞానవేల్ రాజా భార్య నేహా తెలిపారు. హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణం హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కన్నా దారుణంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసారు..పెళ్ళైన మగవారిని హీరోయిన్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వారి భార్యలు సంతోషంగా ఉండడం ఇష్టం లేదా అంటూ ప్రశ్నించారు. కొంతమంది హీరోయిన్లు పెళ్లైన వారిని టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ఫోన్ చేయడం.. బెడ్ రెడీగా ఉందని పిలిపించుకోవడం ఇదే పనిగా మారిందని తీవ్రమైన పదజాలం వాడారు.
నేహా చేసిన ఈ వ్యాఖ్యల్లో తన భర్త జ్ఞానవేల్ ని హీరోయిన్లు బుట్టలో వేసుకుంటున్నారని అనుమానాలు తలెత్తాయి. ఈ వ్యవహారం మొత్తంలో తన భర్తకు సంబంధం లేదని నేహా క్లారిటీ ఇచ్చింది. నేహా ఘాటు వ్యాఖ్యలు ఎవరిపై అనే చర్చ హాట్ హాట్ గా జరుగుతోంది.