పోలవరం నిర్మాణం పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒరిస్సా దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణలో భాగంగా ఒరిస్సా,తెలంగాణా ఛత్తీస్‌ఘడ్ లలోని ముంపు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరింది. పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తామని అఫిడవిట్ ఫైల్ చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాదు స్వతంత్ర సంస్థతో పబ్లిక్ హియరింగ్ పాటు దాని విధివిధానాలను సైతం అఫిడవిట్ లో తెలపాలని కోరింది. అనంతరం తదుపరి విచారణ వచ్చేనెల(సోమవారం) కి వాయిదా వేసింది.