పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం ఇదివరకే చేసినందున, మరోసారి చేయాల్సిన అవసరం లేదని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలపడంతో.. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలంటూ ఒడిశా వేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. బ్యాక్ వాటర్ విషయంలో పునరాలోచించుకోవలసిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ముంపు జలాలపై ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థనను ధర్మాసనం తోసి పుచ్చింది. తదుపరి విచారణను నవంబర 15కు వాయిదా వేసింది. దాంతో తాత్కాలికంగా నిలిచిపోయిన పోలవరం పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి.