రింగ్ రూ.10 కోట్లు, వాచీ రూ.1.40 కోట్లు

Update: 2018-03-24 08:29 GMT

మూడు రోజుల పాటు సిబిఐ, ఈడీ నిర్వహించిన సోదాల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసు నిందితుడు నీరవ్ మోడీకి సంబంధించి దిమ్మ తిరిగే సంపద బయటపడింది.
నీరవ్ మోడీ. ఫోర్బ్స్‌ ధనవంతుడు. సెలబ్రిటీ వజ్రాల వ్యాపారి. తన పేరుమీదనే డైమండ్‌ రిటైల్ స్టోర్‌ స్థాపించాడు. మూడు ఖండాల్లో బంగారు వ్యాపార సామ్రాజ్యాలను నెలకొల్పాడు. ముఖ్యంగా లండన్, న్యూయార్క్‌లో ప్రధాన దుకాణాలున్నాయి. ఢిల్లీ, ముంబై, పూణేతో పాటు దేశంలోని చాలా నగరాల్లో స్టోర్స్‌ ఉన్నాయి. ఎందరో హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లు మోడీ క్లైంట్స్. అన్ని పార్టీల రాజకీయ నాయకులకు ఇతను ఎంత చెబితే అంత. పార్టీలకు కోట్లకు కోట్లు విరాళాలు ఇచ్చేస్తాడు.
2011 నుంచే స్కామ్‌ జరుగుతోందని, గతనెలలోనే గ్రహించింది పీఎన్‌బీ. దీంతో సీబీఐ, ఎన్‌ఫోర్స్‌‌మెంట్, ఈడీలకు ఫిర్యాదు చేసింది. ఈ మొత్తం స్కామ్‌లో పలువురి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసింది సీబీఐ. నీరవ్‌ మోడీ, అతని సోదరుడు నిశాల్, భార్య అమి, వ్యాపార భాగస్వామి మోహుల్‌ చోక్సీ, డైమండ్‌ ఆర్‌ అజ్, సోలార్‌ ఎక్స్‌పోర్ట్స్, స్టెల్లార్‌ డైమండ్స్‌కి చెందిన అందరు భాగస్వాములతో పాటు ఇద్దరు బ్యాంకు అధికారులు గోకుల్‌నాథ్‌ శెట్టీ, మనోజ్‌ ఖారత్‌ల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నాయి.
అసలు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును మోడీ అండ్ బ్యాచ్‌ ఎలా మోసం చేశారంటే ముంబై బ్రాంచ్‌కు చెందిన పీఎన్‌బీ సిబ్బంది నీరజ్‌ అండ్‌ కోకు తప్పుడు ‘లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లు జారీచేశారు. ఈ ఎల్‌ఓయూతో ఫారెన్‌లో ఉన్న ఇండియన్ బ్యాంకుల నుంచి రుణాలు పొందారనేది ప్రధాన ఆరోపణ. థర్డ్‌ పార్టీకి తమ ఖాతాదారుడు చెల్లించాల్సిన మొత్తానికి హామీనిస్తూ బ్యాంకులు ఈ ఎల్‌ఓయూలు జారీచేస్తుంటాయి. వీటిని హామీగా పెట్టుకుని విదేశాల్లోని బ్యాంకు శాఖలు రుణాలిస్తాయి. 150 ఎల్‌వోయూలను నీరవ్ కుటుంబ సభ్యులు వాడుకున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు తదితర 30 బ్యాంకుల నుంచి మోడీ అండ్ గ్యాంగ్, రూ. 11,400 వేల కోట్లకుపైగా లోన్స్‌ పొందినట్లు, దేశ, విదేశాల్లో నగల దుకాణాలు తెరిచారని విచారణలో తేలింది.
తాజాగా నీర‌వ్ మోడీ దెబ్బ‌తో  హాంకాంగ్ - పీఎన్‌బీ నుంచి వచ్చిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ డాక్యుమెంట్‌ను, స్విఫ్ట్‌ మెసేజ్‌ను పరిశీలించింది. క్లయింట్లలో -పీఎన్‌బీలో మోసానికి పాల్పడ్డవారు (నీరవ్‌ మోదీ, ఛోక్సీల కంపెనీలు) ఉన్నట్లు తాజాగా తేలింది. సుమారు 411.82 మిలియన్‌ డాలర్ల (రూ 2636 కోట్ల) మేర చెల్లింపులు చేశాం. ఈ మొత్తాన్ని గ్యారంటీ ఇచ్చిన పీఎన్‌బీ భర్తీ చేస్తుందని ఆశిసున్నాం’’ అని యూకో బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.  
ఇప్పటిదాకా పీఎన్‌బీ జారీ చేసిన ఎల్‌ఓయూల వల్ల అలహాబాద్‌ బ్యాంకు ($336.87 మిలియన్లు), యూనియన్‌ బ్యాంకు($300 మిలియన్లు) మాత్రమే నష్టపోయాయని భావిస్తున్న కేంద్రానికి యూకో బ్యాంక్‌ సమాచారంతో మరో షాక్ తగిలింది.
అయితే నీర‌వ్ మోడీ ఆస్తుల్ని స్వాధీనం చేసుకునేందుకు రంగంలోకి దిగిన సీబీఐ , ఈడీల‌కు దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలిన‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా ఎంత‌ధ‌న‌వండుతైన స‌రే వాచ్, ఉంగరం మ‌హా అయితే కోటి, రెండు కోట్లు ఉంటుంది. కానీ వేల‌కోట్ల కుంభ‌కోణానికి పాల్ప‌డ్డ నీర‌వ్ మోడీ ఉంగ‌రం, వాచ్ ఖ‌రీదు ఎంతో తెలుసా..?సిబిఐ, ఈడి అధికారులు మూడు రోజుల పాటు ముంబైలోని సముద్ర మహల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. పెద్ద యెత్తున వస్తువులను వారు స్వాధీనం చేసుకున్నారు. అత్యంత విలువైన వస్తువులు వారికి చిక్కాయి.
 . సిబిఐ, ఈడి అధికారులకు చిక్కిన రింగ్ విలువ పది కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. వాచీ రూ.1.40 కోట్ల విలువ చేస్తుందని అంటున్నారు.
నీరవ్ మోడీ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువుల విలుపను లెక్క కట్టే పనిలో సిబిఐ, ఈడి అధికారులు ఉన్నారు. తమకు చిక్కిన వస్తువుల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
 ఈడి సోదాలు ఇలా. నీరవ్ మోడీకి చెందిన 21 ఆస్తులను ఈడీ గత నెలలో సీజ్ చేసింది. వాటిలో ఓ పెంట్‌హౌస్, ఓ ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ర.523 కోట్ల వరకు ఉంటుందని అంచనా. సమన్లు జారీ చేసినప్పటికీ నీరవ్ మోడీ గానీ చోక్సీ గానీ దేశానికి తిరిగి రావడానికి సిద్ధపడడం లేదు. 
 

Similar News