జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టిన అయన.. విజయవాడలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి పవన్ మాట్లాడారు.. ఈ సందర్బంగా అయన తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను 2012లోనే రాజకీయాలపై మాట్లాడేందుకు చంద్రబాబును కలిశానని. అప్పుడే రాజకీయ పార్టీ పెట్టి 2014 ఎన్నికల్లో 60–70 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబునాయుడుకు చెప్పానన్నారు.
అప్పుడు అయన మీరు పార్టీపెట్టి విడిగా పోటీచేస్తే ఓట్లు చీలిపోతాయని, ఆ ఆలోచన తద్వారా పోటీ వద్దని చంద్రబాబు అప్పట్లో తనకు సూచించారన్నారు.2014 ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతిస్తే తనకు రాజ్యసభ సీటు ఇస్తానని చంద్రబాబు చెప్పినట్టు పవన్ చెప్పారు. అయన వైఖరి నచ్చకే దండం పెట్టి ఆ తర్వాత బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్రమోదీని కలిసినట్టు చెప్పారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసినవేనన్నారు.