పరిటాల రవి కాదు..ఆ గుండు నేనే కొట్టించుకున్నా : పవన్

Update: 2017-12-12 05:56 GMT

రాజధానిలో అమరావతి ఆఫీస్ 
అమరావతిలో జనసేన ఆఫీస్‌ నిర్మాణానికి ప్లేస్ ఫిక్స్ అయ్యింది. త్వరలోనే మూహూర్తం కూడా ఖరారు చేయనున్నారు. మంగళగిరి మండలం చినకాకాని దగ్గర.. కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆఫీస్ నిర్మించే స్థలాన్ని.. జనసేనాని పవన్ పరిశీలించారు. కార్యాలయం నిర్మాణానికి భూములు లీజుకు ఇచ్చిన రైతులకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణహితంగా జనసేన కార్యాలయం నిర్మిస్తామన్నారు పవన్. ఇక్కడ నిర్మించబోయే కార్యాలయం తనకు దేవాలయంతో సమానం అన్నారు. సమస్యలకు పరిష్కారకేంద్రంగా జనసేన ఆఫీస్ ఏర్పాటు చేస్తానన్నారు పవన్ కల్యాణ్.
కులం..కులం 
తనకు కులం అంటగట్టొద్దని జనసేన అధినేత పవన్‌ అన్నారు. కులం గురించి అడిగే పరిస్థితి ఉండొద్దని... కొంతమంది చేసిన పనులను సమాజానికి అంటగట్టొద్దని పవన్‌ సూచించారు. తెలంగాణలో కుల కొట్లాటలు లేవని, అక్కడ ఉన్నది తెలంగాణవాదమేనని పవన్‌ అన్నారు. అభివృద్ధి జరగాలంటే కులాల కుంపట్లు ఉండొద్దని.... అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలు, ప్రాంతాలకు అందాలి పవన్‌ డిమాండ్ చేశారు. మల్టీకల్చర్‌ ఉన్న హైదరాబాద్‌ను సీఎం చంద్రబాబు సులభంగా అభివృద్ధి చేయగలిగారు అని పవన్‌కల్యాణ్ తెలిపారు.
పవన్ కల్యాణ్ కు గుండు కొట్టించిన పరిటాల రవి 
దివంగత టీడీపీ నేత పరిటాల రవి తనకు గుండు గీయించారని కొంతమంది టీడీపీ నేతలు  ప్రచారం చేశారని, ఆ గుండు తానే కొట్టించుకున్నానని..గుండు గీయించుకున్నారనేది అబద్ధమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వివరణ ఇచ్చారు. అవమానం జరిగితే నేను ఊరుకునేవాడినేనా? అంటూ ప్రశ్నించారు. 

Similar News