కొన్నిరోజులుగా కంటి సమస్య కారణంగా ఇబ్బందిపడుతున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్, గురువారం మరోసారి ఎడమ కంటికి ఆపరేషన్ జరిగింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోవున్న ‘సెంటర్ ఫర్ సైట్’ కంటి ఆసుపత్రిలో డాక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. కొద్దిరోజులపాటు రెస్ట్ తీసుకోవాలని పవన్‌కి సలహా ఇచ్చారు. గతంలో కంటి ఆపరేషన్ చేశాక.. తగినంత విశ్రాంతి తీసుకోకపోవడం వల్లే కంటికి ఇన్‌ఫెక్షన్ అయ్యిందని జనసేన పార్టీ నేతలు తెలిపారు. దీంతో డాక్టర్ సలహా మేరకు పవన్ మరోసారి ఆపరేషన్ చేయించుకున్నారని వెల్లడించారు. ఈసారి కూడా తగినంత విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లుగా ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు.