పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. మొదటి నాలుగు రోజుల ఉభయ సభలను స్థంభింపజేసిన ఏపీ ఎంపీలు ఇవాళ కూడా పార్లమెంట్‌లో ఆందోళన కొనసాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలు నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ వైసీపీ, కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగనున్నారు. పార్లమెంట్‌లో వైసీపీ ఆందోళన కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగనున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.