పద్మావత్ సినిమా వివాదం తారాస్థాయికి చేరింది. డైరక్టర్ బన్సాలీ రాజ్ పుత్ వంశానికి చెందిన కర్ణిసేనను కించపరిచేలా పద్మావత్ ను చిత్రీకరించారంటూ ఆ వర్గం నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో దేశ వ్యాప్తంగా సినిమా విడుదల కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ పోలీసుల పహారాలో సినిమా ఈ రోజు విడుదల చేయడంతో వివాదం ఉదృతమైంది. అంతేకాదు సినిమాలో పద్మావత్ గా యాక్ట్ చేసిన దీపిక కోసి తెచ్చిన వారికి ఐదు లక్షల్ని బహుమతిగా ఇస్తామని కర్ణిసేన ప్రకటించింది. కర్ణిసేనకు మద్దతకు గా కర్ణిసేన, శ్రీరామ సేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ విధ్వంసం సృష్టించారు. సినిమా థియేటర్ల వద్ద అలజడి సృష్టించారు.
అయితే సినిమా విడుదలతో భారత్ లో ఇంత గందరగోళం నెలకొందంటే దాయాది దేశం పాకిస్థాన్ విడులవుతుందా అనే అనుమానం మొదలైంది. భారత్ లో ఇంత విధ్వసం సృష్టిస్తున్న పద్మావత్ పాకిస్థాన్ లో ఎలా విడుదలవుతుంది అని ప్రశ్నించే వాళ్లు ఉన్నారు. కానీ ఆ దేశ మాత్రం పద్మావత్ ను రెడ్ కార్పేట్ పరిచి మరీ ఆహ్వానించింది. కర్ణిసేన చేస్తున్న ఆందోళనలో అర్ధం లేదనే సంకేతాల్ని ఇచ్చిన పాక్ సెన్సార్ బోర్డ్ సినిమాకు క్లీన్ - యు సర్టిఫికేట్ ఇచ్చింది.
తొలత భారత్ లో విడుదల పద్మావత్ పాకిస్తాన్ కు వచ్చిందనే విషయం తెలుసుకున్న సెన్సార్ సభ్యులు ఆదేశ ప్రముఖ యూనిరవ్సిటీ ఖాయీద్-ఇ-అజామ్ నుంచి ఓ సీనియర్ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో సినిమా చూసినట్లు వార్తలు వచ్చాయి. ఫ్రొఫెసర్ చెప్పినట్లు గా ఆ సినిమాలో ఎటువంటి అభ్యంతరకరంగా, చరిత్ర వక్రీకరణ జరగలేదని చెప్పడంతో సెన్సార్ క్లియర్ చేశారు. త్వరలో పాక్ లో కూడా మన పద్మావత్ రిలిజ్ కాబోతుంది.