కుక్కని, పిల్లుల్ని చూసినా భౌ అంటూ భయపడే వాళ్లని చూస్తుంటాం. కానీ పెద్ద పులిని చూసి ఓ పెద్దాయన చాలా పద్దతిగా కొట్టాడు. కొంచెం కూడా భయపడకుండా ధీరుడిలా ఎదురు తిరిగాడు. తాను పెంచుకుంటున్న ఆవుల కోసం చిరుత పులిపై ఎదురు దాడి చేశాడు. చివరికి పులిని చంపేసి... పోటుగాడు అనిపించుకున్నాడు.
జింకను వేటాడేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుంది మరి అలాంటిది పులినే వేటాడాలంటే మనమించెంత ఓపికగా ఉండాలి ఓ సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది డైలాగులకు ఏమో గానీ నిజానికి దూరం నుంచి జూలో పులిని చూడాలంటేనే మనకు చాలా భయం. అది గాండ్రించింది అంటే ఒక్కసారిగా వణుకుపుడుతుంది. అలాంటిది ఓ రైతు పెద్ద సాహసమే చేశాడు. ఓ రైతు, చిరుతల మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. ఆ భీకర యుద్ధంలో చిరుత పులి ఓడిపోయింది.
చిత్తూరు జిల్లా ఆంధ్రా-తమిళనాడు సరిహద్దులోని కృష్ణ గిరి వద్ద మహారాజ కడై గ్రామంలో పాడి ఆవులపై చితరుత పులి దాడి చేసింది. అదే సమయంలో ఆవులకు కాపలా ఉంటున్న 62 ఏళ్ల కృష్ణమూర్తి ఏ మాత్రం భయపడకుండా చిరుతపై దాడి చేశాడు. ఆ సమయంలో తన వద్ద ఉన్న మచ్చు కత్తితో చిరుతను నరికాడు. ఈ ఘటనలో కృష్ణమూర్తికి స్వల్ప గాయాలు కాగా, చిరుత చనిపోయింది.
ఇక చితరుపై దాడి విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ కృష్ణమూర్తిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి, చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం స్వల్ప గాయాలతో కృష్ణమూర్తి చికిత్స పొందుతున్నాడు. ఏదైమైనా.. 62 ఏళ్ల వయసులో చిరుతతో పోరాడి.. కృష్ణమూర్తి తన ప్రాణాలను కాపాడుకున్నాడు..