నీరవ్ మోడీని పట్టుకోవడంలో విఫలం

Update: 2018-03-03 14:41 GMT

బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా దారిలో చెక్కేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ విషయంలో.. కేంద్రం ఘోరంగా విఫలమైంది. విచారణకు రావాలని మెయిల్ పెడితే.. తాను వ్యాపారాల కారణంగా రాలేనని మాత్రమే రిప్లై మెయిల్ ఇవ్వడం మినహా.. నీరవ్ మోడీకి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి రాకపోవడం.. ఇప్పుడు సంచలనంగా మారింది.

నీరవ్ అమెరికాలోని న్యూయార్క్ లో తల దాచుకుంటున్నాడని.. ఎవరికీ కనిపించకుండానే విదేశాల్లోని తన వ్యాపారాలను చక్కబెట్టుకుంటున్నాడని.. తెలుస్తోంది. ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ కూడా స్పందించింది. తమ దేశంలోనే నీరవ్ మోడీ ఉన్నాడని వస్తున్న వార్తలపై తమకు సమాచారం లేదని చెప్పింది. నీరవ్ ఉన్నాడని కూడా ధృవీకరించలేమని స్పష్టం చేసింది.

కానీ.. విచారణలో మాత్రం భారత్ కు అవసరమైన సహాయం చేస్తామని అమెరికా చెప్పింది. దీంతో.. విజయ్ మాల్యాను పట్టుకోలేకపోయిన కేంద్రం.. ఇప్పుడు నీరవ్ మోడీ విషయంలోనూ చేతులెత్తేసినట్టు అయిపోయిందని అంతా అనుకుంటున్నారు. ఈ విషయాన్ని విపక్షాలు కూడా రాజకీయం చేసే పనిలో పడ్డాయి.

--

Similar News