ఈ ఏడాదికిగానూ ఆస్కార్‌కి ఎంపికైన భారతీయ చిత్రం 'న్యూటన్'. రాజ్‌కుమార్ రావ్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ హిందీ చిత్రం శుక్రవారం వెండితెరపైకి వచ్చింది. రిలీజ్ అయిన రోజు కలెక్షన్లు వీక్‌గా ఉన్నా.. మౌత్ టాక్‌తో ఈ సినిమా ఆ తరువాత మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. శుక్రవారం రూ.96 లక్షలు, శనివారం రూ.2.52 కోట్లు, ఆదివారం రూ.3.42 కోట్లు, సోమవారం రూ.1.31 కోట్లు రాబట్టిందీ సినిమా. నాలుగు రోజులకిగానూ.. రూ.8.21 కోట్లు నమోదయిందన్నమాట.
శుక్రవారం కంటే సోమవారం కలెక్షన్లు బాగుండడం చూస్తేనే తెలుస్తోంది.. 'న్యూటన్' జనాలని ఎంతగా ఎట్రాక్ట్ చేసిందో. ఇది కేవలం ఇండియా బిజినెస్ మాత్రమే కావడం గమనార్హం. మొత్తానికి.. 'న్యూటన్' బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలచేలానే ఉన్నాడు. అమిత్ వి.మసుర్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అంజలి పాటిల్, పంకజ్ త్రిపాఠి, రఘుబీర్ యాదవ్ కీలక పాత్రల్లో నటించారు.