‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. ఈ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించారు. టీజర్, పాటలకు అద్భుత స్పందన వస్తున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు స్టూడెంట్ గా కనిపించనున్నారు. టీజర్ లో చిత్తూర్ యాసలో శ్రీ విష్ణు పలికిన ఘాటైన డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ కాన్పెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీవిష్ణు మరో సక్సెస్ సాధిస్తాడన్న నమ్మకంతో ఉన్నారు సినిమా యూనిట్.
వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన ‘బిచ్చగాడు’ ఫేమ్ సాట్నా టైటస్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రశాంతి, కృష్ణ విజయ్ మరియు అట్లూరి నారాయణ రావు అరాన్ మీడియా వర్క్స్, శ్రీ వైష్ణవి క్రియేషన్స్ బ్యానర్ లపై సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘నీది నాది ఒకే కథ’ చిత్రం మార్చి 23 న విడుదల కానుంది. ప్రేక్షకులను అలరించనుంది.