ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డైలీ సీరియళ్ల ప్రభావంతో మహిళల్లో క్రూరత్వం పెరుగుతుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో పురుషులపై మహిళల వరుసదాడులు దురదృష్టకరమన్నారు. మహిళల నుంచి పురుషులను రక్షించేందుకు పురుష కమిషన్ ఏర్పాటు చేయాల్సి వస్తుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. సీరియల్స్ పై కూడా సెన్సార్ విధించాల్సిన అవసరం ఉందన్నారు నన్నపనేని రాజకుమారి.