మోడల్ ని హత్యచేసి... సూట్ కేస్ లో కుక్కి

Update: 2018-10-16 12:19 GMT

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మోడల్‌ మాన్సీ దీక్షిత్‌ అంధేరీలో దారుణ హత్యకు గురైంది. కొన్ని రోజుల కిందట  హైదరాబాద్‌కు చెందిన ముజామిల్‌ అనే యువకుడు బంధువులతో కలిసి ముంబైకి వచ్చాడు. మాన్సీ దీక్షిత్‌ ప్లాట్  పక్కనే ముజామిల్‌ బంధువులు నివాసం ఉంటున్నారు.  ఈ క్రమంలో మాన్సీ కి ముజామిల్‌ కు మధ్య చిన్నపాటి గొడవ జరిగి పెద్దదైంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పెనుగులాటకు దారి తీసింది. దీంతో కోపోద్రిక్తుడైన ముజామిల్‌ మాన్సీని హతమార్చాడు. అనంతరం.. ఎవరికీ అనుమానం రాకుండా శవాన్ని సూట్‌కేసులో కుక్కి టాక్సీని పిలిచాడు. మలాద్‌ ఏరియాలో ఆమె శవాన్ని పడేసి మళ్లీ ఇంటికి చేరుకున్నాడు. అయితే  ముజామిల్‌ ప్రవర్తనపై అనుమానం రావడంతో టాక్సీ డ్రైవర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. దాంతో అతడిని పోలిసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మలద్‌ ప్రాంతం నుంచి మాన్సీ శవాన్ని స్వాధీనం చేసుకుని, పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు తెలుస్తోంది.

Similar News