తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం : మంత్రి పరిటాల సునీత

Update: 2018-10-20 09:48 GMT

టిట్లీ తుఫాను అపార నష్టం చేకూర్చిందని, భాదితులకు ప్ర్తభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని అన్నారు మహిళా సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత.. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని తుఫాను ప్రభావిత గ్రామాల్లో పర్యటించిన సునీత బాధితులను పరామర్శించారు.. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలు, అధికారుల పనితీరును గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు.. మండలంలోని పెదంచల, చినంచల గ్రామాల్లో పర్యటించిన మంత్రి సునీత సహాయక చర్యలను పరిశేరిలించారు.. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ తుఫాను బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు ప్రారంభించిందని తెలిపారు.. తుఫాను ప్రభావంతో జరిగిన నష్టాన్ని చూసి చెలించిపోయానని పేర్కొన్నారు.. ముఖ్యం ఉద్యానవనంగా పిలువబడే ఉద్దానం ప్రాంతం తుఫాను ధాటికి పూర్తిగా నాశనం అయిపోయిందని అన్నారు..తెలుగుదేశం పార్టీ రైతు పక్షపాతి పార్టీ అన్న మంత్రి సునీత , తెలుగుదేశం ప్రభుత్వం ఉద్దానంలోని రైతులకు పూర్తి న్యాయం చేస్తుందని పేర్కొన్నారు.. ఇప్పటికే అన్ని గ్రామాల్లో త్రాగు నీరు, భోజనం , నిత్యావసర సరుకులు అందిస్తున్నామన్న ఆమె తుఫాను ప్రభావిత ప్రాంతాలని సాధారణ స్థితికి తీసుకొచ్చేనందుకు అన్ని చర్యలు జరుగుతున్నాయని తెలిపారు.

Similar News