కేసీఆర్‌ దొంగ దీక్షలు చేసిన సంగతి అందరికీ తెలుసు: ఏపీ మంత్రి

Update: 2018-10-05 09:09 GMT

ఓటమి బయంతోనే కేసీఆర్ అవాకులు, చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేసిన ఆయన తెలంగాణలో టీడీపీని టార్గెట్ చేస్తున్నాడని విమర్శించారు. మనిషికి రెండు కళ్లే ఉంటాయని, మూడు కళ్లు ఉన్నాయంటే దెయ్యానివా అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. 2009లో దేహీ అని చంద్రబాబును ప్రాధేయపడి టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడని, డబ్బుకోసం వెంపర్లాడాడని మండిపడ్డారు. 2009లో ఎంత డబ్బు తీసుకున్నావో చెప్పాలని మంత్రి ఆనందబాబు అడిగారు. నాలుగేళ్లలో ఏం చేశావో చెప్పాలన్న ఆయన దొంగ దీక్షలు చేసిన సంగతి అందరికీ తెలుసన్నారు. 

Similar News