జనసేనకు మెగా ఫ్యామిలీ మద్దత్తు... త్వరలోనే....

Update: 2018-07-07 05:21 GMT

జనసేనాని పవన్‌ కల్యాణ్‌కు క్రమంగా శక్తి పుంజుకుంటోందా ? పవన్‌కు మెగాబ్రదర్స్‌కు తోడవుతున్నారా ? చిరంజీవి ఫ్యాన్స్‌ను లీడ్ చేసే స్వామి నాయుడుతోపాటు మెగా అభిమానులు జనసేన కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. 

వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు పవన్‌ కల్యాణ్‌ రెడీ అవుతున్నారు. అందుకనుగుణంగా జనసేనానికి వేగంగా అడుగుతు వేస్తున్నారు. మొన్నటి వరకు ఒక్కడే పార్టీని నడిపించిన పవన్‌ కల్యాణ్‌‌కు మెగా ఫ్యామిలీ మొత్తం మేమున్నామంటూ ముందుకు వచ్చింది. ఇప్పటి వరకు ఫ్యామిలీ నుంచి ఎలాంటి మద్దతు రాలేదు. మెగా ఫ్యామిలీ మొత్తం ఏకతాటిపైకి వచ్చి పవన్‌కు మద్దతివడంతో జనసేనానికి కొండంత బలం వచ్చినట్లయింది. తాజాగా మెగాస్టార్‌ ఫాలోవర్స్‌గా కొనసాగుతున్న చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు స్వామినాయుడుతో పాటు మెగా అభిమానులు ఈ నెల 9న జనసేనలో చేరనున్నారు. 

నిన్న చిరుతో సమావేశమైన నాగబాబు, చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు స్వామినాయుడు జనసేన పార్టీలోకి చేరే అంశంపై అభిమానుల పాత్ర ఏ విధంగా ఉండాలన్న దానిపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ అభిమానులు మెగా అభిమానులందరూ కలసి పనిచేయాలని చిరంజీవి సూచించినట్లు సమాచారం. ప్రజారాజ్యం సమయంలో పార్టీకి, అభిమానులకు వారధిగా ఉన్న నాగబాబు జనసేనలో కీ రోల్ పోషించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ,బాబాయ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పొలిటికల్ రంగస్దలంలోకి దూకుతానని ప్రకటించారు. యువహీరోలు సాయిదరమ్ తేజ్, వరుణ్ తేజ్ ట్విట్టర్‌లో జనసేన పార్టీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కొన్ని రోజులుగా జనసేనానికి, అల్లు అరవింద్‌కు బాగా దూరం ఏర్పడింది. అయితే శ్రీ రెడ్డి ఎపిసోడ్‌తో ఫిలిం ఛాంబర్‌కు వచ్చి నిరసనలో పాల్గొన్నారు అల్లు అర్జున్‌. ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతమై జనసేనాని ఉత్సాహంలో ఉంటే మేమున్నామంటూ మెగా బ్రదర్స్ మధ్దతు తెలపడంతో మరింత జోష్‌తో ఉన్నారు పవన్‌ కల్యాణ్‌.

Similar News