అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణం ఏంటి.? కనిపించడానికి అత్యంత అందంగా.. అత్యంత ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి ఎలా చనిపోయింది..? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది..? ఇలాంటి ప్రశ్నలన్నీ ఆమె మరణించిన తరువాత ఉత్పన్నమయ్యాయి. అంతేకాదు ఆమె అందం కోసం తీసుకున్న అతి జాగ్రత్తల వల్ల ప్రాణాలు పోయాయని వార్తలు వచ్చాయి.
అందం కోసం శరీరాన్ని ముప్పుతిప్పలు పెట్టిన శ్రీదేవి.. సర్జరీలు కూడా చేయించుకుందన్న మాట.. అంతే కాక.. తిండి కూడా తగ్గించేసి రెగ్యులర్ గా డైట్ కంట్రోల్ చేసిందన్న మాట.. ఆమె సంబంధికులు తరచూ చెబుతున్నారు. దీంతో.. శరీరానికి తగిన కార్బోహైడ్రేట్లు.. విటమిన్లు అందకపోయి ఉండొచ్చని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే.. శ్రీదేవి అలసటకు, అంతులేని అనారోగ్యానికి గురై ఉంటుందని.. అది అటు తిరిగి.. ఇటు తిరిగి.. చివరికి గుండెపోటుకు దారి తీసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని అందం కోసం ఆరాటపడే ప్రతి ఒక్కరూ ఓ గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చాలా మంది హితువు పలికారు. అంతేకాదు శ్రీదేవిపై హత్యయత్నానికి పాల్పడ్డారంటూ కథనాలు ప్రసారమయ్యాయి.
బోనీ మేనళ్లుడు వివాహానికి హాజరైన శ్రీదేవి జుమేరా ఎమిరేట్స్ హోటల్ బాత్రూంలో పడి కన్నుమూసింది. అయితే ఆమె మరణానికి ముందు బోనీ - శ్రీదేవికి మధ్య పెద్ద యుద్ధం జరిగిటన్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. పెళ్లికి వచ్చిన మొదటి బార్య పిల్లలతో తన భర్త బోనీ సన్నిహితంగా ఉండడం, తనపిల్లల్ని పట్టించుకోకపోవడంతో శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేసినట్లు తేలింది. ఇదే విషయంపై బోనీతో చర్చించడంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని ..ఆ తరువాత కొన్ని గంటల్లో శ్రీదేవి మరణించడంతో అనుమానాలు మొదలయ్యాయి. అందుకు ఊతం ఇచ్చేలా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపణలు చేయడంతో పలువురు ఆమె మరణంపై అనేక అనుమానాల్ని వ్యక్తం చేశారు.
దుబాయ్ లో ఎవరైనా మరణిస్తే చట్టం ప్రకారం వారు ఎందుకు మరణించారో తెలుసుకొని భౌతిక కాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తారు. అలాగే శ్రీదేవి మరణం పై కేసు నమోదు చేసుకున్నదుబాయ్ అధికారులు విచారణ చేపట్టారు. అతిలోకసుందరి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతుండడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. బోనీకపూర్ ను అదుపులోకి తీసుకొని నిర్విరామంగా విచారించారు. విచారణ చేపట్టిన ప్రాసిక్యూషన్ శ్రీదేవి మరణంలో బోనీ తప్పులేదని , ప్రమాదవశాత్తూ బాత్రూంలో పడి మరణించారని తీర్పించింది. అనంతరం భౌతికకాయాన్ని బోనీకి అప్పగించడంతో ముంబైలో అంత్యక్రియలు నిర్వహించారు.
ఈనేపథ్యంలో శ్రీదేవి ఎలా మరణించారనే విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. శ్రీదేవి మరణంలో ఎలాంటి కుట్రజరగలేదని, ఒకవేళ అదే జరిగితే విచారణలో బయటపడేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రావేష్ కుమార్ తేటతెల్లం చేశారు.
శ్రీదేవిమరణంపై అనుమానాలు ఉన్నప్పటికి ఆమె భర్త బోనీ విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్ గదిలో మాట్లాడుకున్న బోనీ - శ్రీదేవి భయటకు వెళ్లేందుకు రెడీ అవుతుండగా బాత్రూంలోకి వెళ్లి చనిపోయింది. అయితే శ్రీదేవి మరణంపై తొలత అనుమానం వ్యక్తం చేసిన దుబాయ్ ప్రభుత్వం బోనీని విచారించింది. అయితే వివిధ కోణాల్లో బోనీని ప్రశ్నించడంతో తన భార్య శ్రీదేవి ఎలా చనిపోయిందో బోనీ దుబాయ్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. తల నుండి కాళ్ల వరకు మునిగి బాత్రూంలోకి వెళ్లిన శ్రీదేవి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో రూంలో ఉన్న తనకి అనుమానం రావడంతో బాత్రూం డోర్ ఓపెన్ చేశామని, ఆ సమయంలో శ్రీదేవి తల నుండి కాళ్ల వరకు నీటితో నిండి ఉన్న బాత్ టబ్‌లో మునిగి ఉందని బోనీ కపూర్ చెప్పినట్లు.... ట్రేడ్ అనలిస్ట్ కోమల్ నహతా వెల్లడించారు. కాబట్టే విచారణకు ఎక్కువ సమయం పట్టిందని ..ప్రమాదవశాత్తూ మునిగిపోవడం వల్ల ఆమె మరణించినట్లు దుబాయ్ పోలీసులు తేల్చారు. మూడు రోజుల విచారణ అనంతరం ఆమె భౌతిక కాయాన్ని ఇండియాకు పంపించారు.