ఏపీ డీజీపీ ఠాకూర్‌లో విశాఖ మన్యంలో పర్యటిస్తుండగానే మావోయిస్టులు మరోసారి తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ MKVB కార్యదర్శి కైలాసం పేరుతో ఉన్న లేఖలను అంటించారు. గురుప్రియ సేతు బ్రిడ్జి నిర్మాణాన్ని ఆపాలంటూ ఈ లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. ఆదివాసీల జీవనోపాధిని దెబ్బతీసి ఖనిజ సంపదను కార్పోరేట్లను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. బల్ల రిజర్వాయర్‌లో నీటి మట్టాన్ని తగ్గించాలంటూ లేఖలో కోరారు. డీజీపీ పర్యటన సమయంలోనే మావోయిస్టుల లేఖలు వెలియడంతో మరోసారి అలజడి రేగింది.