ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోయిన్లపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. నిన్న హీరోయిన్ అమలాపాల్ పై వ్యాపారవేత్త లైంగిక వేదింపులు పాల్పడ్డాడనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళ నటి అత్యాచార వేధింపులకు గురైంది. హీరోయిన్ అమలాపాల్ పాల్ తన పై లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డాన్స్ స్కూల్ యజమాని అయిన అళగేశన్ తనతో అసభ్యంగా , పరుషపదజాలంతో అశ్లీలంగా మాట్లాడని మొరపెట్టుకుంది. అంతేకాదు మలేషియాలో ఉన్న తన ఫ్రెండ్స్ తో డిన్నర్ కి వెళ్లాలని కోరాడని తెలిపింది. ఈ సందర్బంగా తన పై వచ్చిన వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అమలా పాల్ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే అమలాపాల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే మలయాళ నటి సనూషా పై లైంగిక వేధింపులు జరిగాయనే వార్తలు వస్తున్నాయి. తమిళంలో రేణిగుంట, భీమ చిత్రాలతో సుపరిచితురాలైన సనూషా బుధవారం రాత్రి కున్నూర్ నుంచి తిరువనంతపురం రైలులో ప్రయాణం చేస్తుండగా ఆంటోబోస్ అనే వ్యక్తి నిద్రిస్తున్న సనూషపై లైంగిక వేధిపులకు పాల్పడ్డాడు. దీనిపై సనూష టీటీఈకి ఫిర్యాదు చేసింది. వెంటనే రైల్వే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అంటోబోస్ తమిళనాడుకు చెందిన వ్యక్తిగా సమాచారం.